సమీక్ష : నిప్పు – రవితేజ మార్కు రొటీన్ సినిమా

విడుదల తేది : 17 ఫిబ్రవరి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : గుణశేఖర్
నిర్మాత :వైవిఎస్ చౌదరి
సంగిత డైరెక్టర్ : తమన్
తారాగణం : రవి తేజ , దీక్షా సేథ్ , రాజేంద్ర ప్రసాద్ , ప్రదీప్ రావాంత్

మాస్ మహారాజ రవితేజ తన స్నేహితులు గుణశేఖర్ మరియు వైవిఎస్ చౌదరి తో కలిసి ‘నిప్పు’ చిత్రంతో మన ముందుకు వచ్చారు. దీక్ష సేథ్ హీరొయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. గుణ శేఖర్ దర్శకత్వం వహించగా వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

సూర్య (రవితేజ) జిమ్ కోచ్ గా పని చేస్తుంటాడు. శ్రీ (శ్రీరామ్) మరియు సూర్య ఇద్దరు ప్రాణ మిత్రులు. శ్రీ మరియు మేఘన (దీక్షా సేథ్) ల తండ్రి మూర్తి (రాజేంద్ర ప్రసాద్). రాజా గౌడ్ (ప్రదీప్ రావత్) అరాచకాల మీద సూర్య తిరగబడుతుంటాడు. శ్రీ సౌది అరేబియా కి వెళ్లి అక్కడ పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. సూర్య తన స్నేహుతుడైన శ్రీ ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. శ్రీ ఇరుక్కున్న సమస్యకి రాజా గౌడ్ కి సంబంధం ఉంటుంది. శ్రీ ఈ సమస్య నుండి బయట పడేందుకు సూర్య , రాజా గౌడ్ మీ ఎలా ఒప్పించాడు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

రవితేజ తనదైన శైలిలో ఎనర్జిటిక్ పాత్రలో నటించాడు. సూర్య పాత్రలో ఇమిడిపోయి తన ఎనర్జీ లెవల్స్ ఎక్కడా తగ్గకుండా నటించాడు. తన ట్రేడ్ మార్క్ డైలాగ్ డెలివరీ మ్యానరిజం తో ప్రేక్షకులను మరియు ఆయన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటాడు.దీక్షా సేథ్ చాలా బావుంది. ఆమె నటన కూడా బావుంది. రవితేజ, దీక్షా సేథ్ ల మధ్య కెమిస్ట్రీ బావుంది. వారిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగా పండాయి. కాశి పాత్రలో బ్రహ్మానందం బాగా నవ్వించాడు. ప్రదీప్ రావత్ మరియు శ్రీరామ్ వారి పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. బ్రహ్మాజీ ఉన్న సన్నివేశాలు బాగా నవ్వించాడు. అతన్ని సరిగ్గా వాడుకుంటే కామెడీ బాగా పండిస్తాను అని నిరూపించాడు. ధర్మవరపు చిన్న పాత్రలో బాగానే నవ్వించాడు. హరీష్ శంకర్ ఒక పాటలో అలా కనిపించి వెళ్ళాడు. ముకుల్ దేవ్ పర్వాలేదు. సినిమా వేగంగా సాగుతూ బోరింగ్ సన్నివేశాలు లేకుండా సాగింది. రవితేజ పంచ్ డైలాగులు కూడా బాగా అలరిస్తాయి. బ్రహ్మానందం మరియు రాజేంద్రప్రసాద్ మధ్య బొమ్మరిల్లు స్పూఫ్ బాగా పండింది. కొన్ని పాటలు కూడా బాగా చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్:

సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి తగ్గ పాత్ర నివ్వలేకపోయారు. అంతగా ప్రాధాన్యత లేని పాత్ర ఆయన పోషించారు. అలాగే కృష్ణుడు లాంటి మంచి నటుడిని కూడా సరైన పాత్రకు వాడుకోలేకపోయారు. ఎన్నో సినిమాల్లో నటించిన మాస్టర్ భరత్ బాగా లావు తగ్గాడు. అంత బరువు తగ్గి కామెడీ కూడా టైమింగ్ కూడా సరిగా చూపించలేకపోయాడు. గీత సింగ్ అయితే చిరాకు తెప్పిస్తుంది. చిత్ర కథనం ఇంకా బాగా చేయాల్సింది. శ్రీరామ్ సమస్యకి ప్రదీప్ రావత్ తో ఉన్న సంభందాన్ని సరిగా చూపించలేకపోయారు. గ్రాఫిక్స్ అస్సలు బాగా చూపించలేదు. రవితేజ తన బైక్ తో ట్రక్ మీద దూకించే సన్నివేశాలు ప్రేక్షకులకు రుచించవు.

సాంకేతిక విభాగం:

గుణశేఖర్ పనితనం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే బావుంది. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం ఆయన ఇంకా మెరుగుపరుచుకుంటే బావుంటుంది. ఆయన నేరేషన్ మరియు స్క్రీన్ప్లే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. ఈ చిత్రం గుణశేఖర్ మార్కు తో ఉండకపోవడం విశేషం. శ్రీధర్ సీపాన రాసిన డైలాగులు చాలా బావున్నాయి. గౌతం రాజు గారి ఎడిటింగ్ బాగాలేదు. ఆయన ఎడిటింగ్ బావుండి ఉంటే సినిమా ఇంకా మంచి రేంజ్ కి వెళ్లి ఉండేది. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.డాన్సులు రవితేజ స్టైల్లో పర్వాలేదనిపించాయి. ఫైట్లు కూడా బాగానే తీసారు.

తీర్పు:

నిప్పు సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ నేరేషన్ మరియు స్క్రీన్ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. రవితేజ మార్కు సినిమాలు నచ్చే వారికి నచ్చుతుంది. ఏలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీకు కూడా నచ్చవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్: 3/5

అనువాదం :అశోక్ రెడ్డి. ఎమ్

Clicke Here For ‘Nippu’ English Review

Exit mobile version