Samantha: మంత్రి కామెంట్స్‌పై సమంత రియాక్షన్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని సురేఖ చేసిన ఆరోపణలను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సినిమా స్టార్స్ పర్సనల్ లైఫ్‌ని రాజీకయాల్లోకి లాగడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సమంత కూడా తనపై సదరు మంత్రి చేసిన కామెంట్స్‌పై స్పందించింది.

ఒక మహిళగా బయటకొచ్చి పనిచేయడం ఎంతో కష్టం. అలాంటిది, ఈ గ్లామర్ రంగంలో ఒడిదుడుకులను తట్టుకుని ఇంతటి స్థాయికి చేరుకోవడం ఎంత కష్టంతో కూడుకున్న ప్రయాణం అనేది తనకు తెలుసని.. ఇలా తన జీవిత ప్రయాణంపై మంత్రి కామెంట్స్ చేయడం సరికాదని సమంత తెలిపింది. తన వివాహాజీవితాన్ని ఇద్దరి అంగీకారంతో రద్దు చేసుకున్నామని.. అయినా అది తమ వ్యక్తిగత విషయమని.. ఇలా దానిపై మాట్లడటం సరికాదని సమంత పేర్కొంది.

తన విడాకులు పూర్తి పర్సనల్ విషయం అని.. దాన్ని రాజకీయాలకు వాడుకుని అనవసరంగా రచ్చ చేయొద్దని సమంత కోరింది. తాను రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ వచ్చానని.. ఇకపై కూడా రాజకీయాలకు దూరంగానే ఉండాలని అనుకుంటున్నట్లు సమంత తెలిపింది. ఇలా తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మహిళా మంత్రిగా సురేఖకు ఏమాత్రం తగదని సమంత ఈ సందర్భంగా తెలిపింది.

Exit mobile version