తమిళ యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ‘మెర్కురి’ చిత్రం రేపు భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రమే రిలీజవుతున్న ఈ సైలెంట్ థ్రిల్లర్ పై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొని ఉంది ప్రేక్షకుల్లో. తెలుగునాట కూడ సినిమాను మంచి స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు.
కొద్దిసేపటి క్రితమే సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కార్తిక్ సుబ్బరాజ్ వర్క్ పట్ల చాలా ఇంప్రెస్ అయ్యారు. సినిమా చాలా బాగుందని, థ్రిల్లర్ జానర్లో ఇదొక గొప్ప చిత్రంగా నిలుస్తుందని, సాంకేతికంగా కూడ బ్రిలియంట్ గా ఉందని అన్నారట. ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న పలు భాషల్లో విడుదలచేయనున్నారు.