తమిళ సినిమాల్లో పలు పాత్రల్లో నటించి మంచి పేరు అందుకున్న నటి విచిత్ర కొన్నేళ్లుగా చిత్రసీమకు దూరం అయ్యారు. ఇక తాజాగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 తమిళ్ లో ఆమె ఒక కంటెస్టెంట్ గా ఉన్నారు. అయితే నవంబర్ 21న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో భాగంగా నటి విచిత్రను తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీనికి సమాధానంగా విచిత్ర మాట్లాడుతూ సుమారుగా 20 సంవత్సరాల క్రితం నేను ఒక తెలుగు సినిమాలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యింది.
ఈ సినిమా షూటింగ్ మళంపుజ అడవుల్లో జరిగింది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే మొదటి రోజు సినిమా యూనిట్ తో పాటు హోటల్ మేనేజ్‌మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసిందని అన్నారు. అదే రోజు రాత్రి నేను క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను ఎదుర్కొన్నానని అన్నారు. పార్టీ ముగిసిన అనంతరం ఆ సినిమాలోని హీరో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్‌గా తన గదికి రమ్మని అడిగారని చెప్పి వాపోయారు.
ఆ మాట విన్న నేను ఒక్కసారిగా షాక్ కి గురయ్యానన్నారు. ఇక ఆ తరువాత సినిమాలంటే ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందని, అందుకే ఆ భయంతో పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నానని విచిత్ర తెలిపారు. కాగా ప్రస్తుతం విచిత్ర మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.