విడుదల తేదీ : ఆగస్టు 02, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: ఎస్ ఎస్ రాజమౌళి, రమా రాజమౌళి, జేమ్స్ కేమరూన్, జో రస్సో, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, కరణ్ జోహార్ మరియు ఇతరులు
దర్శకులు: రాఘవ్ ఖన్నా, తన్వి అజింక్యా
నిర్మాతలు : అనుపమ చోప్రా, సమీర్ నాయర్ మరియు దీపక్ సెగల్
సంగీత దర్శకుడు: రోహిత్ కులకర్ణి
సినిమాటోగ్రఫీ: నికుంజ్ సింగ్
ఎడిటర్ : సంయుక్త కాజా
సంబంధిత లింక్స్: ట్రైలర్
ఓటిటి దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో పలు డాక్యుమెంటరీ సిరీస్ లు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే. మరి ఈ డాక్యుమెంటరీ లలో మొదటిగా ఒక దర్శకుడు కోసం వారు ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ని చేయడం జరిగింది. మరి ఆ దర్శకుడే ఎస్ ఎస్ రాజమౌళి కాగా ఆ డాక్యూ చిత్రమే “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి”. మరి ఈ చిత్రం ఎలా అనిపించిందో సమీక్షలో చూద్దాం.
ఈ డాక్యు ఫిల్మ్ కథేంటి? :
కేవలం ఒక్క ఎపిసోడ్ గానే ప్లాన్ చేసిన ఈ డాక్యుమెంటరీ చిత్రంలో రాజమౌళి తాలూకా బాల్యం నుంచి ఇప్పుడు గ్లోబల్ దర్శకుడిగా ఎలా ఎదిగారు అనే ప్రక్రియని చూపించడం జరిగింది. తాను మొదటిసారి దర్శకుడిగా ఎలా అయ్యారు? తన కుటుంబం సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఓ సినిమా చేస్తున్న సమయంలో తన భార్యకి జరిగిన ప్రమాదకర ఘటన.. ఎలా చాలానే తెలియని విషయాల కలయికే ఈ డాక్యుమెంటరీ చిత్రం తాలూకా సారాంశం. రాజమౌళి అలాగే తన కుటుంబం కోసం కూడా పలు విషయాలు ఏంటి అనేవి తెలుసుకోవాలి అని ఈ డాక్యుమెంటరీని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
డెఫినెట్ గా ఈ డాక్యు చిత్రం తెలుగు సినిమా పట్ల మక్కువ ఉన్న వారు తమ తెలుగు చిత్రాన్ని గ్లోబల్ స్థాయికి ఒక తెలుగు దర్శకుడు ఎలా తీసుకెళ్లగలిగాడులోకల్ నుంచి ఆస్కార్ వరకు అని చూపించే ప్రయాణంతో ఉద్వేగభరితమైన అంశాలతో మెప్పిస్తుంది. ముఖ్యంగా రాజమౌళి ఇండస్ట్రీలో పడిన కస్టాలు.. అసలు సినిమా కోసం తాను ఎంతవరకు వెళ్లగలడు అని చూపించే కొన్ని ఉదాహరణలు అయితే చాలా మందిని షాక్ కి గురి చేస్తాయి.
అలాగే తమ కుటుంబం సంబంధించి ఒక్క ప్రస్తుత రోజుల్లో ఒక కుటుంబం ఎలా ఉండాలి అనేదానికి కూడా ప్రేరణగా నిలిచేలా కలిసికట్టుగా వీరు ఎలా ఉంటున్నారు అని చూపించే అంశాలు ఆలోచింపజేసేలా చేస్తాయి. అలాగే తన తండ్రి లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కెరీర్ స్టార్టింగ్ లోనే ఎదురైన పెద్ద దెబ్బలు ఇలా చాలా మనకు తెలియని అంశాలు ఈ చిత్రంలో చెప్పడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
అలాగే ఇంట్లో అంతా విపరీతమైన దైవ భక్తి కలిగి ఉంటే రాజమౌళి ఒక్కరు మాత్రం ఎందుకు నాస్తికుడిగా ఉన్నారు వంటివి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బాగున్నాయి. ఇంకా మరింత హైలైట్ గా అయితే రాజమౌళి తన మొదటి సినిమా “స్టూడెంట్ నెంబర్ 1” నుంచి గ్రాఫిక్స్ తో ఆడుకునే దర్శకునిగా ఎలా ఎదిగాడు అనే అంశాలు సింహాద్రి, మగధీర, ఈగ వంటి సినిమాలు తన కెరీర్ లో ఎంత ముఖ్యం అనేవి చూపించడం ఆయా హీరోల ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది.
ఇక దీనితో పాటుగా ఒకో స్టార్ హీరో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు జక్కన్నతో వర్క్ ఎలా ఉంటుంది. తమని ఎంతలా హింస పెడతాడు అనే వంటివి మంచి ఫన్ గా చెప్పారు. అలాగే రాజమౌళి ఒక పని రాక్షససుడు అంటూ చెప్పడం RRR సినిమా సమయంలో చరణ్, ఎన్టీఆర్ లు ఎంత పర్ఫెక్ట్ గా చేయాలి అని తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటారు అనేవి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
అలాగే ఈ డాక్యుమెంటరీ తెలుగు ఆడియెన్స్ ని మరింత ఉద్వేగబరిచే అంశాలు ఏవన్నా ఉన్నాయి అంటే అవి “అవతార్”, “అవెంజర్స్” లాంటి సినిమాలు చేసిన దిగ్గజ దర్శకులు జేమ్స్ కేమరూన్, జో రస్సో వంటి వారు రాజమౌళి వర్క్ ని కొనియాడడం రాజమౌళి కూడా డెఫినెట్ గా హాలీవుడ్ సినిమా తీయగలిగే సత్తా ఉన్నవాడు అని చెప్పడం వంటివి మంచి హైలైట్ గా కనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఇక డాక్యుమెంటరీ చిత్రం కోసం మెయిన్ గా తెలుగు ఆడియెన్స్ లో రాజమౌళి ఎవరెవరితో వర్క్ చేసారో ఆ హీరోస్ తాలూకా అభిమానులు అంతా ఎదురు చూసారు. కానీ ఈ ఫిల్మ్ లో రవితేజతో రాజమౌళి చేస్తిన తన బెస్ట్ వర్క్ చేసిన విక్రమార్కుడు కోసం కానీ ఇంకా ఈగ సినిమా విషయంలో నాని కోసం కానీ చూసేవారు మాత్రం ఒకింత డిజప్పాయింట్ అవ్వవచ్చు.
అలాగే మధ్యలో కొన్ని మూమెంట్స్ ఒకింత బోర్ కలిగించే ఛాన్స్ ఉంది. రాజమౌళి ఫ్యామిలీ సంబంధించి కొన్ని అంశాలు రిపీటెడ్ వస్తున్నట్టుగా కనిపిస్తాయి. వీటితో కొంచెం స్లోగా అక్కడక్కడా బోర్ ఫీల్ కలుగుతుంది. అలాగే ఎండింగ్ కూడా ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది.
అలాగే తెలుగు డబ్బింగ్ విషయంలో మాత్రం తెలుగు ఆడియెన్స్ బాగా డిజప్పాయింట్ అవుతారు. మన తెలుగు స్టార్ హీరోస్ తో చేసిన ఈ సినిమాలో డబ్బింగ్ మాత్రం వేరే వారితో వారి వీడియోలు చూడడం అనేది బాధాకరమే అని చెప్పాలి. కనీసం వీడియో షూట్ చేస్తున్నపుడు స్టూడియోలో రికార్డు చేసిన వాయిస్ లేదా అప్పుడే మెక్స్ తో సెట్ చేయాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మోడర్న్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి” డాక్యుమెంటరీ చిత్రం తన అభిమానులకి మంచి ట్రీట్ కలిగిస్తుంది అని చెప్పాలి. అభిమానులు కాకుండా జెనరల్ ఆడియెన్స్ కి కూడా జక్కన్నకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తన స్ట్రగుల్స్ చిన్న నాటి నుంచి ఇప్పుడు గ్లోబల్ దర్శకుడిగా ఎలా మారారు అని చూపించిన విధానం బాగుంది. ఇంకా హాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళి వర్క్ ని ప్రశంసించడం వంటివి తెలుగు ఆడియెన్స్ కి ఇండియన్ మూవీ లవర్స్ కి నచ్చుతాయి. కాకపోతే ఇందులో కొన్ని డల్ మూమెంట్స్ కూడా లేకపోలేవు. అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు ఉన్నాయి. వీటితో అయితే రాజమౌళి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ఓటిటిలో ఓసారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team