‘మంచు’ వార్.. మోహన్ బాబు ఆడియో మెసేజ్!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ఎలాంటి పేరుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు అని టాలీవుడ్ సెలెబ్రిటీలు ఆయన్ను ప్రశంసిస్తుంటారు. ఇక ఆయన సంతానం కూడా ఇప్పటివరకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఉండటంతో మంచు ఫ్యామిలీపై ప్రేక్షకుల్లోనూ మంచి అభిమానం ఉంది. అయితే, తాజాగా మంచు ఫ్యామిలీలో నెలకొన్న కొన్ని వ్యక్తిగత సమస్యలు తారాస్థాయికి చేరుకున్నాయి.

మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అనేలా ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ గొడవకు దిగుతున్నాడు. ఆయన పోలీసులకు కూడా ఈ మేరకు ఫిర్యాదు అందించాడు. అయితే, తాజాగా మోహన్ బాబు ఇంటిలోకి మనోజ్‌తో పాటు పలువురు చొరబడటంతో ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, ఈ పరిణామాలపై మోహన్ బాబు తాజాగా ఓ వాయిస్ మెసేజ్ రిలీజ్ చేశారు. మంచు మనోజ్ తనపై దాడి చేశాడని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. తమ మధ్య ఘర్షణ జరిగింది వాస్తవమని.. అది దాడి కాదని ఆయన తెలిపారు. మనోజ్ తాగుడుకు బానిసయ్యాడు.. దాని కారణంగా అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడని.. అది నచ్చకపోవడంతోనే అతడిని ఇంటిలోని రానివ్వడం లేదని మోహన్ బాబు ఎమోషనల్‌గా తెలిపారు.

తాను కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలకు మనోజ్ భంగం కలిగించాడని మోహన్ బాబు పేర్కొన్నాడు. తన కష్టార్జితాన్ని తన బిడ్డలకు ఎలా పంచాలో తనకు తెలుసని.. ఈ విషయంలో మీడియా జోక్యం చేసుకోవద్దని ఆయన కోరారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరాడు. ఇలా మోహన్ బాబు వాయిస్ మెసేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి.

Exit mobile version