సమీక్ష: “బరోజ్ 3D” – టెక్నికల్ గా బాగున్నా , డల్ గా సాగే కథనం

సమీక్ష: “బరోజ్ 3D” – టెక్నికల్ గా బాగున్నా , డల్ గా సాగే కథనం

Published on Dec 25, 2024 11:26 PM IST
Mohan Lal Barroz 3d Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 25, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : మోహన్ లాల్, షయ్లా మెక్ కఫ్రివ్, ఇగ్నాసియో మతియోస్, పద్మావతి రావు సీజర్, రఫెల్ అమర్గో

దర్శకుడు : మోహన్ లాల్

నిర్మాత : ఆంటోనీ పెరంబవూర్

సంగీత దర్శకులు : లిడియన్ అశ్వరం

సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్

కూర్పు: బి అజిత్ కుమార్

సంబంధిత లింక్స్: ట్రైలర్

మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “బరోజ్ 3D”. మరి తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎంతవరకు అలరించిందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథలోకి వస్తే.. 1663 సమయంలో పోర్చుగీసు నుంచి వచ్చిన ఓ రాజకుటుంబం అయినటువంటి డ గామా రాజుల దగ్గర ఎంతో విధేయుడిగా బరోజ్(మోహన్ లాల్) పని చేస్తారు. అయితే ఆ డ గామా(ఇగ్నాసియో మతియోస్) రాజుకి ఉన్న భారీ నిధికి ఒక విధేయుడు కాపలాగా ఉండాలి అని బరోజ్ ని కాపలాగా పెట్టి నెల రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాను అని ఆ రాజు వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో బరోజ్ కి ఏమయ్యింది. తాను ఆ రాజకోటలో భూతంగా 400 ఏళ్ళు పాటు ఎలా ఉండాల్సి వచ్చింది? ఆ నిధిని కాజేయడానికి యత్నించింది ఎవరు? బరోజ్ కి మోక్షం లభిస్తుందా లేదా? ఈ కథలో ఇసాబెల్లా(షయ్లా మెక్ కఫ్రివ్) అనే చిన్నారి పాత్ర ఎంతవరకు కీలకం? ఆ నిధి ఆఖరికి ఏమయ్యింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

డెఫినెట్ గా ఈ చిత్రం ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఫాంటసీ వండర్ అని చెప్పొచ్చు. ఒక ఫిక్షనల్ చందమామ కథలా ఈ చిత్రం అనిపిస్తుంది. అలాంటి ఫాంటసీ సినిమాలు ఇష్టపడేవారు ఈ చిత్రంలో కొన్ని విజువల్స్, కథాంశంతో కొంతమేర ఏకీభవించవచ్చు. అలాగే ఈ చిత్రాన్ని కేవలం 3డి వెర్షన్ లోనే ఎందుకు రిలీజ్ చేస్తాం అనేది సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది.

విజువల్స్ పరంగా 3డి ఎఫెక్ట్స్ పరంగా ఈ చిత్రాన్ని మోహన్ లాల్ తన విజన్ తో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. అలాగే తన నటన కూడా సినిమాలో డీసెంట్ గా ఉంది. ఒక విధేయుడిగా, భూతంగా మోహన్ లాల్ సినిమాలో అలరిస్తారు. అలాగే తనతో పాటుగా చిన్నారి నటి ఈషా కూడా బాగా చేసింది. వీరిద్దరి నడుమ కొన్ని ఎమోషన్స్ సినిమాలో పర్వాలేదనిపిస్తాయి.

అలాగే సినిమా టెక్నికల్ పరంగా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మెయిన్ గా మోహన్ లాల్ విజన్ కి తగ్గట్టుగా కొన్ని విజువల్స్ సినిమాటోగ్రఫీలో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు సినిమాలో ఇంప్రెస్ చేస్తాయి. ఇక మోహన్ లాల్ తో పాటుగా సినిమా ఆద్యంతం సాగె యువ నటి షయ్లా మెక్ కఫ్రివ్ మెప్పిస్తుంది. అలాగే తనతో పాటుగా ఇతర ఆంగ్ల నటులు తమ పాత్రల్లో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

సాంకేతికంగా చాలా బలంగా ఉన్న ఈ చిత్రం కథనం పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి. సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తర్వాత సినిమా నెమ్మదిగా చాలా రొటీన్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఈ తరహా సినిమాలు అన్నీ ఎప్పుడో చూసేసినవే కదా అనిపిస్తాయి.

మామూలుగా ఇలాంటి ఫాంటసీ సినిమాలు మన దగ్గర రావడమే చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడెప్పుడో సిద్ధార్థ్ అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తరహా సినిమాలని ఇష్టపడేవారికి ఓకే కానీ ఈ సినిమా మిగతా వర్గాల ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంటుందని చెప్పాలి. కథనం చాలా రొటీన్ గా సాగదీతగా అనవసరంగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది.

మోహన్ లాల్ డెఫినెట్ గా కథనం పరంగా ఇంకా జాగ్రత్తలు వహించాల్సింది. ఒక మంచి ఫాంటసీ లైన్, దానికి తోడు నిధి లాంటి కాన్సెప్ట్ లో మరింత ఎంగేజింగ్ సీన్స్ తో కథనం డిజైన్ చేసి ఉంటే బరోజ్ ట్రీట్ ఇంకా బాగుండేది. అలాగే చాలా వరకు సినిమా ఫ్లాట్ గానే సాగుతుంది మరీ ఎగ్జైట్ చేసే అంశాలు కానీ ట్విస్ట్ లు లాంటివి కానీ ఈ సినిమాలో కనిపించకపోవడం మరో డ్రాబ్యాక్ అని చెప్పాలి.

సాంకేతికవర్గం:

పైన చెప్పినట్టుగా ఈ చిత్రం టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. మేకర్స్ పెట్టిన ప్రతీ రూపాయి ఖర్చు ఒక మంచి ఫాంటసీ సినిమాగా దీనిని చూపిస్తుంది. అలాగే సెట్టింగ్స్, సంగీతం, సినిమాటోగ్రఫీలు సినిమాలో స్టన్నింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా 3డి ఎఫెక్ట్స్ సూపర్బ్ గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల మాత్రం విఎఫ్ఎక్స్ వీక్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ లో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేయాల్సింది.

ఇక మోహన్ లాల్ దర్శకత్వంకి వస్తే.. ప్రస్తుత తరానికి మంచి ఫాంటసీ చిత్రాన్ని అందించాలి అనుకున్నారో ఏమో కానీ సినిమాని ఇంకా ఎంగేజింగ్ గా నడిపే కథా కథనాలు తాను అలోచించి బెటర్ వెర్షన్ ని ప్లాన్ చేస్తే బాగుండేది. టెక్నికల్ పరంగా తన విజన్ చాలా బాగుంది కానీ స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ పై ఇంకా వర్క్ చేయాల్సింది. నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లని తాను రాబట్టారు కానీ ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బరోజ్ 3D” సాంకేతిక పరంగా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అలాగే 3డి లో ఆ విజువల్స్ అద్భుతంగా కనిపిస్తాయి. మరి ఈ తరహా ఫాంటసీ కథలు ఇష్టపడే వారికే ఒకింత ఓకే అనిపించవచ్చు ఏమో కానీ ఈ చిత్రం మిగతా ఆడియెన్స్ ని మాత్రం థియేటర్స్ సీట్లలో కూర్చోపెట్టలేదు. చాలా వరకు కథనం సాగదీతగా అనిపిస్తుంది. కేవలం ఆ 3డి ఎఫెక్ట్స్, మోహన్ లాల్ అంటే విపరీతంగా అభిమానం ఉన్నవారు తప్ప మిగతా వారు ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు