ప్రస్తుతం మళయాళ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో మోహన్ లాల్ హీరోగా నటించిన భారీ చిత్రం “ఎంపురాన్” కోసం తెలిసిందే. మళయాళంలో అయితే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనే రేంజ్ లో హైప్ దీనిపై అక్కడ ఉంది. నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వస్తుండగా ఈ సినిమా ఇపుడు రిలీజ్ కి ముందే ఓ భారీ రికార్డు సెట్ చేసింది.
బుక్ మై షో యాప్ లో ఇది వరకు ఏ ఇండియన్ సినిమా కూడా సాధించని ఫీట్ ని సాధించింది. హవర్లి బుకింగ్స్ లో ఏకంగా ఒక్క గంటలో 96 వేలకి పైగా టికెట్స్ బుక్ చేసుకొని ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. దీనితో రిలీజ్ కి ముందే ఇండియన్ సినిమా దగ్గర కొత్త రికార్డుని ఈ చిత్రం నమోదు చేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా లూసిఫర్ కి సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఈ మార్చ్ 27 న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.
The Highest Hourly Pre-Sales Ever in Indian Cinemas on BOOKMYSHOW????????
96.14K/Hr ????????#Empuraan #L2EBMS – https://t.co/N8VWfpo2bn
Paytm – https://t.co/Fjlf0z8Vtv
District – https://t.co/y1UCD4nLGV
Ticketnew – https://t.co/wvQGWTXGxa#March27 @mohanlal #MuraliGopy @antonypbvr… pic.twitter.com/LRBg5EVjgt— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 21, 2025