ప్రముఖ స్టార్ హీరోకు అస్వస్థత

ప్రముఖ స్టార్ హీరోకు అస్వస్థత

Published on Aug 18, 2024 4:32 PM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ అస్వస్థతకు గురైనట్టు మలయాళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మోహన్‌లాల్‌ గత కొంతకాలంగా తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్య, కండరాల నొప్పితో బాధపడుతున్న తెలుస్తోంది. కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల మోహన్‌లాల్‌ జాయిన్ అయ్యారని ఆ వార్తల సారాంశం. కాగా మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని మోహన్‌లాల్‌ కి వైద్యులు సూచించారట.

మోహన్‌లాల్‌ హెల్త్‌ బులెటిన్‌ అంటూ ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఆ మెడికల్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన తేదీ ఆగస్టు 16గా ఉంది. దీన్ని చూసిన పలువురు అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌లాల్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ఆరోగ్యం నిలకడగానే ఉండి. మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘బరోజ్‌’ అక్టోబరు 2న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు