బుకింగ్స్ తోనే “ఎంపురాన్” ఊహించని నంబర్స్!

బుకింగ్స్ తోనే “ఎంపురాన్” ఊహించని నంబర్స్!

Published on Mar 24, 2025 12:00 AM IST

ప్రస్తుతం మళయాళ సినిమా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఎల్ 2 – ఎంపురాన్” అనే చెప్పాలి. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో ఈ చిత్రానికి జరుగుతున్న బుకింగ్స్ తోనే చెప్పొచ్చు.

ఆల్రెడీ మళయాళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సెట్ చేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా కేవలం బుకింగ్స్ తోనే 50 కోట్లకి పైగా గ్రాస్ ని క్రాస్ చేసేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇటీవల పలు భారీ పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే సాధ్యం అయ్యింది. కానీ ఎక్కువగా మళయాళంలో మాత్రమే హైప్ ఉన్న ఈ సినిమాకి ఈ రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ అవుతుండడం మాత్రం ఊహించనిది అని చెప్పక తప్పదు. ఇక ఇంకా రిలీజ్ కి మరో మూడు రోజులు సమయం ఉంది. ఇక అప్పటికి అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ అందుకుంటుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు