ప్రస్తుతం మళయాళ సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మోహన్ లాల్ హీరోగా నటించిన భారీ సీక్వెల్ చిత్రం ఎల్ 2 ఎంపురాన్ అనే చెప్పాలి. కొన్నేళ్ల కితం మళయాళంలో రిలీజ్ అయ్యిన మొదటి చిత్రం లూసిఫెర్ అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇలా దీనికి సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేయగా అప్పుడు నుంచి అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు.
మరి ఇపుడు దీని తాలూకా ట్రైలర్ ని మేకర్స్ నేడు మధ్యాహ్నం 1 గంట తర్వాత రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు కానీ ఊహించని విధంగా తెల్లవారు జాముతోనే మేకర్స్ ఈ ట్రైలర్ ని అన్ని భాషల్లో వదిలేసారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం మంచి డీసెంట్ మూమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగింది అని చెప్పాలి.
పాలిటిక్స్ సహా పవర్ వార్ ఇందులో మోహన్ లాల్ పై క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏంటి అనేవి ప్రధానంగా ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. అలాగే టోవినో థామస్ ఇంకా మంజు వారియర్ లాంటి నటులు సాలిడ్ పాత్రల్లో కనిపిస్తుండగా నటుడు అలాగే ఈ సినిమా దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపించాడు.
ఇక మోహన్ లాల్ మాత్రం ట్రైలర్ లో హైలైట్ అని చెప్పవచ్చు. తనపై పలు ఎలివేషన్స్ గాని తన మాస్ ఎపిసోడ్స్, లుక్స్ డ్రెస్సింగ్ లతో తాను సెటిల్డ్ గా కనిపిస్తున్నారు. ఇంకా ఈ ట్రైలర్ లో దీపక్ దేవ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. అలానే మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఈ మార్చ్ 27న పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి