‘కన్నప్ప’ నుంచి మోహన్‌ లాల్‌ ఫస్ట్ లుక్

‘కన్నప్ప’ నుంచి మోహన్‌ లాల్‌ ఫస్ట్ లుక్

Published on Dec 16, 2024 1:00 PM IST

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. పైగా ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఐతే, సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా మేకర్స్ ప్రతి సోమవారం తమ సినిమాలోని క్యారెక్టర్ లను రివీల్ చేస్తూ పోస్టర్‌లను విడుదల చేస్తూ వస్తున్నారు. ఈరోజు, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పాత్రను రివీల్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఐకానిక్ కిరాత – మాస్టర్ ఆఫ్ ది పాశుపతాస్త్రం, విక్టర్ ఓవర్ ది విక్టోరియస్, ది లెజెండరీ గార్డియన్ ఆఫ్ ది ఫారెస్ట్‌గా ఈ సినిమాలో మోహన్ లాల్ నటిస్తున్నాడు. మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు