‘ఆదిత్య 999’తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ?

‘ఆదిత్య 999’తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ?

Published on Jan 10, 2025 9:01 PM IST

నటసింహం బాలయ్య బాబు వారసుడు ‘నందమూరి మోక్షజ్ఞ’ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఓపెనింగ్ అనేది అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై చాలా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మోక్షజ్ఞ రెండో సినిమా పై ఇప్పుడు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆదిత్య 999 సినిమానే మోక్ష‌జ్ఞ మొదటి సినిమా, ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని.. అన్నట్టు బాలయ్య ఆలోచనలతో ఈ స్క్రిప్ట్ రెడీ అవుతూ ఉండటం విశేషం. ఈ సినిమాకి బాల‌కృష్ణ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. అటు మోక్షజ్ఞ కూడా ఆదిత్య 999పై ఫోక‌స్ పెట్టాడట. ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు