పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు చిత్రాలు సహా తన పాలిటిక్స్ లో కూడా మంచి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సమయంలోనే తాను మొదటి సరిగా నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తున్న సెన్సేషనల్ టాక్ షో అన్ స్టాప్పబుల్ సీజన్ 2 లో గాను హాజరు అయ్యి మరింత ఆసక్తి రేపారు.
మరి తన పవర్ ఫుల్ ఫైనల్ ఎపిసోడ్ ని అయితే మేకర్స్ ఓ రేంజ్ లో హైప్ తో నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురాగా దీనికి రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి ఇదిలా ఉండగా ఈ ఎపిసోడ్ ని ఆహా వారు రెండు పార్టులు గా ప్లాన్ చేయగా మొదటి పార్ట్ పార్ట్ పై ఇప్పుడు అసలు సిసలు హైప్ నెలకొంది అని చెప్పాలి.
మొదటి ఎపిసోడ్ అంతా కూడా తన సినిమాలు రాజకీయాలపై మంచి ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ కాగా ఎపిసోడ్ చివరలో మనకి తెలియని పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలు సంబంధించి ప్రశ్నలతో ఆసక్తి గా టీజ్ చేయడం ఉత్కంఠభరితంగా మారింది. దీనితో ఈ పార్ట్ 2 మాత్రం చాలా హైప్ ఎక్కింది అని చెప్పొచ్చు. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ అయితే వచ్చే శుక్రవారం ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది.