మోలీవుడ్ యువ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మన టాలీవుడ్ లో ఆల్రెడీ డైరెక్ట్ గా ఓ డెబ్యూ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా తర్వాత దుల్కర్ చేసిన చేసిన రెండో తెలుగు సినిమానే “లక్కీ భాస్కర్”. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ డేట్స్ తర్వాత ఫైనల్ గా ఈ సినిమా దీపావళి కానుకగా రాబోతుంది.
అయితే ఈ సినిమాపై అప్పటి వరకు డీసెంట్ హైప్ లోనే ఉంది కానీ సినిమా ట్రైలర్ వచ్చాక మాత్రం సినిమాపై మరింత బజ్ నెలకొంది అని చెప్పాలి. ట్రైలర్ చూసాక ఆడియెన్స్ లో మళ్ళీ ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉంది అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఈ బజ్ ని లక్కీ భాస్కర్ క్యాష్ చేసుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.