“దేవర” కి మరింత డిమాండ్..

“దేవర” కి మరింత డిమాండ్..

Published on Jun 18, 2024 9:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అనుకున్న డేట్ కంటే ముందే సెప్టెంబర్ 27న దేవర ఆగమనం ఉంటుంది అని కాన్ఫ్రేమ్ అయ్యిపోయింది.

ఇప్పుడు దేవర ప్రీపోన్ కావడం ఈ గ్యాప్ లో మరే ఇతర భారీ సినిమాలు విడుదల కూడా లేకపోవడంతో దేవర సినిమాకి మరింత డిమాండ్ నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దేవర కి భారీ ధరలు పలుకుతున్నాయట. ఒక్క కోస్తాంధ్ర బిజినెస్ ఒకటే 55 కోట్ల పైమాటే అంటే ఈ సినిమాకి ఉన్న డిమాండ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మొత్తానికి అయితే ఒక గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్నా ఒక ప్రాపర్ మాస్ సినిమా కావడంతో సాలిడ్ క్రేజ్ ఈ సినిమాపై నెలకొంది. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు