Jr NTR: “దేవర” పై మరిన్ని అంచనాలు.. తారక్ రివీల్ చేసిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “దేవర” మ్యానియా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కనిపిస్తుంది. భారీ ప్రమోషన్స్ ని దేశ వ్యాప్తంగా మేకర్స్ చేస్తుండగా అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు తారక రాముడి మాస్ ఆగమనంని బిగ్ స్క్రీన్స్ పై చూద్దామా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ రీసెంట్ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చూస్తే మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు వరకు ఈ చిత్రంలో కేవలం ఒక్క పాత్రే ఇద్దరు ముగ్గురుగా కనిపిస్తాడు అని లేదా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో అన్నాతమ్ములుగా కనిపిస్తాడు అంటూ చాలానే కన్ఫ్యూజన్ నడిచింది.

కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ “దేవర” అనేది తండ్రి పాత్ర “వర” అనేది కొడుకు పాత్ర అంటూ సినిమాలో ఆ రెండు రోల్స్ తాను చేసినట్టుగా రివీల్ చేసాడు. దీనితో ఓ కన్ఫ్యూజన్ పోయింది అని చెప్పాలి. అలాగే దేవర పాత్రకి తాను రెడీ అయ్యిన విధానం కోసం కూడా చాలా ఎగ్జైట్ అవుతూ తారక్ చెప్పాడు. దీనితో ఇవన్నీ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే విధంగా అనిపిస్తున్నాయి. మరి దేవర లో ఎన్టీఆర్ ఎలాంటి ట్రీట్ ని అభిమానులకి అందించనున్నాడో చూడాల్సిందే.

Exit mobile version