“35 చిన్న కథ కాదు” కి మరిన్ని స్క్రీన్స్.!

“35 చిన్న కథ కాదు” కి మరిన్ని స్క్రీన్స్.!

Published on Sep 11, 2024 12:30 PM IST

చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమా నుంచి వచ్చిన ఒక స్వచ్ఛమైన తెలుగుదనంతో కూడిన సినిమాగా పేరు తెచ్చుకున్న తాజా చిత్రమే “35 చిన్న కథ కాదు”. యంగ్ అండ్ టాలెంటెడ్ నివేత థామస్ అలాగే విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు నందకిషోర్ ఈమని తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ మన్ననలతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
మరి ఈ చిత్రం బాక్సాఫీస్ పరంగా కూడా డీసెంట్ రన్ తో వెళుతుండగా యూఎస్ మార్కెట్ లో సత్తా చాటుతుంది అని చెప్పాలి. అక్కడ ఈ చిత్రానికి ఇపుడు డిమాండ్ నెలకొనడంతో మరిన్ని స్క్రీన్స్ ని పెంచినట్టుగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్ వారు తెలిపారు. మరి యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం 20కి పైగా కొత్త స్క్రీన్స్ ని యాడ్ చేసుకొని ప్రదర్శితం కానుంది. ఇది మాత్రం ఈ చిత్రానికి మరింత సక్సెస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా ఎస్ ఒరిజినల్స్ నిర్మాణం వహించారు అలాగే సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు