పవన్ కి భద్రత పెంపు?

టాలీవుడ్ స్టార్ హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాలకి కాస్త విరామం ఇచ్చి పవన్ తన పొలిటికల్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ రీసెంట్ కొన్ని రోజుల్లోనే పవన్ విషయంలో ఓ షాకింగ్ వార్త అయితే బయటకి వచ్చింది. పవన్ ఇప్పుడు పొలిటికల్ గా మరింత ఫేమ్ తెచ్చుకోవడం ఇతర కారణాల మూలాన తనకి ప్రమాదం పొంచి ఉందని పలు వార్తలు వినిపించాయి.

దీనితో తనకి కేంద్రం భద్రతని కూడా పెంచినట్టుగా టాక్ వచ్చింది. అయితే పవన్ రీసెంట్ గానే సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తన భార్య అనా లెజినోవా డిగ్రీ పట్టా అందుకోగా అందుకు పవన్ కూడా హాజరయ్యారు. మరి తాజాగా రిటర్న్ అవ్వగా ఇండియాలో తనకి పెద్ద మొత్తంలో సెక్యూరిటీ కనిపించడం వైరల్ గా మారింది. పోలీసులు సహా కమాండోస్ కూడా పవన్ కి భద్రతగా కనిపిస్తున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ టాక్ ఆ విజువల్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version