‘జైలర్-2’లో మరిన్ని స్పెషల్ అట్రాక్షన్స్..?

‘జైలర్-2’లో మరిన్ని స్పెషల్ అట్రాక్షన్స్..?

Published on Dec 3, 2024 8:58 AM IST


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు, అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మ్యూజిక్.. రజినీ మార్క్ స్టైల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ఇక ఈ సినిమాలో పలువురు స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

వారిలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి వారు ఉన్నారు. వారి పాత్రలు కూడా సాలిడ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు అందరి చూపు ‘జైలర్-2’పై పడింది. నెల్సన్ ఇప్పటికే జైలర్-2 స్క్రిప్టును రెడీ చేశాడు. రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 5న ఓ సాలిడ్ ట్రీట్ కూడా ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి ‘జైలర్-2’లో మరిన్ని స్పెషల్ అట్రాక్షన్స్‌ను యాడ్ చేయనున్నాడట.

మొదటి భాగంలో ఉన్న స్పెషల్ రోల్స్‌తో పాటు మరికొందరు స్టార్స్‌ను ‘జైలర్-2’లో చూపెట్టబోతున్నాడట ఈ డైరెక్టర్. అయితే, ఈ స్పెషల్ అట్రాక్షన్స్ ఎవరెవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మొదటి భాగంలో జైలర్ భార్యగా నటించిన రమ్యకృష్ణ పాత్రను ఈసారి వేరొకరు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి వీటన్నింటికి సమాధానం దొరకాలంటే, జైలర్-2 మూవీ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు