“ఆదిపురుష్” ఫస్ట్ లుక్ రిలీజ్ పై పెరుగుతున్న ఆసక్తి.!

Published on Sep 23, 2022 10:01 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ షూట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “ఆదిపురుష్”. మన దేశపు ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటించగా ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించింది.

మరి ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఇండియన్ సినిమా దగ్గర ఏ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సినిమా లేట్ అయ్యినంతగా రాలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు అందుకు సమయం దగ్గరకి రానే వస్తున్నట్టుగా గట్టి టాక్ స్టార్ట్ కాగా ఇప్పుడు ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది.

అయితే ఇది మాత్రం ఆల్ మోస్ట్ ఈ దసరా సీజన్లోనే రావచ్చని సినీ వర్గాల నుంచి గట్టి టాక్ వినిపిస్తుంది. మరి ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ అయితే ఏ డేట్ లో ఆడియెన్స్ ముందుకు వస్తుంది అనేది ఇంకా వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని భారీ స్కేల్ లో తెరకెక్కించగా 3D లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :