ఈ వారం అరడజనుకు పైగా సినిమాలు విడుదల

Published on Feb 25, 2021 10:05 pm IST


లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ పరిశ్రమ ఊహించని రీతిలో పుంజుకుంది. ఆక్యుపెన్సీ 50 శాతం నుండి 100 శాతానికి పెరిగింది. ‘క్రాక్, ఉప్పెన, నాంది, రెడ్’ రూపంలో మంచి విజయాలు దక్కాయి. దీంతో వరుస సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ వారం కూడ అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వాటిలో ఎక్కువ బజ్ నితిన్, చంద్రశేఖర్ యేలేటిల ‘చెక్’ మీద ఉండగా ‘అక్షర, క్షణ క్షణం, అంగుళీక, అలీ నటించిన లాయర్ విశ్వనాథ్’ విడుదలకానున్నాయి.

అలాగే ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది, 70 ఎం. ఎం, ఎం.ఎం.ఓ.ఎఫ్’ సినిమాలు కూడ ఈ వారమే రిలీజ్ కానున్నాయి. ఇలా మొత్తం అరడజనుకు పైగా సినిమాలు విడుదలకానున్నాయి. వీటిలో ఏ సినిమా క్రేజ్ ఏంతనేది పక్కనపెడితే రెండు రోజుల్లో ఇన్ని సినిమాలు రిలీజ్ కానుండటంతో సినీ ప్రేక్షకులకు బోలెడన్ని ఛాయిసెస్ లభించినట్లైంది. ఇక ‘ఉప్పెన, నాంది, చక్ర, జాంబిరెడ్డి’ సినిమాలు ఎలాగూ థియేటర్లో ఉండనే ఉన్నాయి. సో.. రానున్న నాలుగైదు రోజులు థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడనున్నాయన్నమాట.

సంబంధిత సమాచారం :