‘బ్యాచ్ లర్’ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ !

‘బ్యాచ్ లర్’ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ !

Published on Oct 18, 2021 1:44 PM IST

బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. పండగ సీజన్ ను క్యాష్ చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వైజాగ్ లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.

ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఐటమ్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చే సినిమాలకు ఎప్పుడూ అండగా నిలబడడం అల్లు అర్జున్ ప్రత్యేకత. గతంలో చాలా సినిమాలకు ఇదే చేశారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు కూడా తన సపోర్ట్ అందిస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఈ ప్రమోషన్స్ తో వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు