‘బ్యాచ్‌ల‌ర్’ రీషూట్ సాంగ్ తోనే !

‘బ్యాచ్‌ల‌ర్’ రీషూట్ సాంగ్ తోనే !

Published on Aug 2, 2020 11:23 PM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. అయితే ముందుగా సాంగ్స్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ చాల కొత్తగా ఉంటాయట. ముఖ్యంగా అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు