ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏదైనా ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాయి. ఇక పండుగ టైమ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా చిత్రాల మేకర్స్ చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయితే, ఇప్పుడు మార్చి 2026 కోసం పాన్ ఇండియా స్థాయిలో పలు సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుని రెడీగా ఉన్నాయి.
అయితే, వాటిలో అన్ని కూడా పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. బాలీవుడ్ నుంచి రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ మార్చి 19, 2026లో రిలీజ్‌క రెడీ అయ్యింది. ఇక సౌత్ నుంచి మార్చి 2026 బరిలో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్‌కు వస్తున్నాయి. కన్నడ హీరో యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ కూడా మార్చి 19న రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ఇక టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న RC16.. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మార్చి 26న రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇలా 2026 మార్చి బరిలో రిలీజ్‌కు ఇప్పటినుంచే కర్చీఫ్ వేసుకుని సినిమాలు రెడీ అవుతున్నాయి.