డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మిస్టర్ బచ్చన్”?

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మిస్టర్ బచ్చన్”?

Published on Jul 23, 2024 5:57 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు