మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ షో రీల్.. అలా ఉండ‌నుందా..?

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ షో రీల్.. అలా ఉండ‌నుందా..?

Published on Jun 17, 2024 12:06 PM IST

మాస్ రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇక ఈ సినిమా నుండి షో రీల్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయ‌డంతో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ షో రీల్ వీడియో గ్లింప్స్ ను నేడు సాయంత్రం 4.05 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మాస్ రీయూనియ‌న్ తో ప్రేక్ష‌కుల‌కు సాలిడ్ ట్రీట్ ఇవ్వ‌నున్నారు. ఈ షో రీల్ వీడియో గ్లింప్స్ లో ఎలాంటి డైలాగ్ ఉండ‌బోద‌ని తెలుస్తోంది. కేవ‌లం కొన్ని షాట్స్ తో ఈ షో రీల్ వీడియో ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ షో రీల్ లో ర‌వితేజ లుక్ అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ లా ఉండ‌నుంద‌ట‌.

ఇక ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బోర్సె హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు