మాస్ రాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఈ కాంబినేషన్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి షోరీల్ వీడియో గ్లింప్స్ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది.
ఎలాంటి డైలాగ్ లేకుండా.. మాస్ రాజా రవితేజ లుక్స్, యాక్షన్ కు తోడుగా థండరింగ్ బీజీఎంతో వచ్చిన ఈ షోరీల్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రవితేజ నుంచి ఎలాంటి మాస్ కోరుకున్నారో, అది ఈ వీడియోలో ఉందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లో ఉంది.
రవితేజకు పర్ఫెక్ట్ మాస్ కథ పడితే ఎలా ఉండబోతుందో, ఈ సినిమా నిరూపించబోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తోండగా, జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.