సమీక్ష: “మిస్టర్ & మిస్ మాహి” – బోరింగ్ స్పోర్ట్స్ డ్రామా

సమీక్ష: “మిస్టర్ & మిస్ మాహి” – బోరింగ్ స్పోర్ట్స్ డ్రామా

Published on Jun 1, 2024 6:07 PM IST
Mr & Mrs Mahi Movie Review in Telugu

విడుదల తేదీ : మే 31, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముద్ మిశ్రా, జరీనా వహాబ్ మరియు ఇతరులు

దర్శకుడు: శరణ్ శర్మ

నిర్మాతలు : కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో యష్ జోహార్, మరియు అపూర్వ మెహతా

సంగీత దర్శకులు: ఆదేశ్ శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, జానీ, అచింత్-యువ, హన్నీ-బన్నీ, ధృవ్ ధల్లా, మరియు జాన్ స్టీవర్ట్ ఎదురురి

సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి

ఎడిటింగ్: నితిన్ బైద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాల్లో హిందీ నుంచి కూడా కొన్ని వచ్చాయి. అలా టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా “మిస్టర్ & మిస్ మాహి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథ లోకి వస్తే.. మహేంద్ర అగర్వాల్(రాజ్ కుమార్ రావు) తన చిన్న నాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి ఉండడంతో పెద్దయ్యాక ఇండియన్ క్రికెట్ టీం లో ఆడాలని కలలు గంటాడు. అయితే కొన్ని పరిస్థితులు రీత్యా తాను క్రికెట్ నుంచి దూరం అయ్యి తన తండ్రి స్పోర్ట్స్ షాప్ ను చూసుకోవాల్సి వస్తుంది. అలా కొన్నేళ్ల తర్వాత తనకి పెళ్లి సంబంధంగా మహిమా (జాన్వీ కపూర్) అతని లైఫ్ లోకి వస్తుంది. వృత్తి రీత్యా ఆమె డాక్టర్ అయినప్పటికీ ఆమె కూడా తనలానే క్రికెటర్ అని తెలుసుకుంటాడు. మరి అక్కడ నుంచి ఆమె కోసం అతను ఏం చేస్తాడు? తాను మళ్ళీ క్రికెటర్ గా మారుతాడా లేక తన భార్యని క్రికెటర్ గా చేస్తాడా? ఈ క్రమంలో వారి కుటుంబాల రియాక్షన్ ఏంటి? అసలు చివరికి ఏమవుతుంది అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

బాలీవుడ్ సినిమాలో ఉన్నటువంటి కొందరు అండర్ రేటెడ్ టాలెంటెడ్ నటుల్లో రాజ్ కుమార్ కూడా ఒకరు. తన నుంచి వచ్చిన చిత్రాల్లో ఇపుడు వరకు నటుడుగా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. అదే విధంగా ఈ సినిమాలో కూడా తాను పలు షేడ్స్ ని అలవోకగా చేసేసాడు. ఒక స్పోర్ట్స్ మెన్ గా ప్రేమ, అసూయ, కోపం ఇలా అన్ని హావభావాలను రాజ్ కుమార్ రావు చాలా బాగా చేసి మెప్పిస్తాడు.

ఇంకా జాన్వీ కపూర్ కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది అని చెప్పాలి. ఆమె కూడా స్పోర్ట్స్ పర్సన్ గా ఫిజికల్ గా ఈ సినిమాకి కూడా చాలా కష్టపడినట్టుగా కొన్ని సీన్స్ లో అనిపిస్తుంది. అలాగే ఆమె క్రికెట్ ఆడే విధానం కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కానీ ఆమె నటన బాగుంది. ఇక వీరితో పాటుగా రాజ్ కుమార్ రావు తండ్రి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు కుముద్ మిశ్రా స్ట్రిక్ట్ ఫాదర్ గా మంచి నటన కనబరిచారు. ఇక వీరితో పాటుగా ఇతర తారాగణం బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకి మేకర్స్ రిలీజ్ ముందు అంతా ఓ ఎమోషనల్ స్పోర్ట్ డ్రామా తీసినట్టుగా మంచి ప్రమోషన్స్ అదీ అంటూ హంగామా చేశారు కానీ సినిమాలో అసలు అంత విషయమే లేదు. మెయిన్ గా సినిమాలో ప్రధాన పాయింట్ నే ట్రైలర్ లో రివీల్ చేసేశాక అది చూసి సినిమా చూసేవారికి సినిమా అంతా యిట్టె అర్ధం కావడం అటుంచితే పరమ బోరింగ్ గా సాగదీతగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది.

సినిమా రెండున్నర గంటల్లోపే అయినప్పటికీ అలా డల్ గా సాగుతూనే ఉంటుంది. అంతే కాకుండా ఈ సినిమా చూస్తున్నపుడు పలు సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ మన జెర్సీ, తదితర స్పోర్ట్స్ డ్రామా లు చూసినట్టే అనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని చోట్ల జాన్వీ, రాజ్ కుమార్ నడుమ ట్రాక్ లు మరింత బోరింగ్ గా అనిపిస్తాయి.

ఇంకా ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కావు. ఇంకా ఈ తరహా సినిమాల్లో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషించాలి. ఈ సినిమాకి ఏకంగా 8 మంది సంగీతం అందించారు. కానీ వారి అందరి పనితనం కూడా సినిమాని ఎలివేట్ చేయలేకపోయింది. వీటితో అయితే సినిమా చాలా డల్ గా విస్తుపోయేలా అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం:

ఈ సినిమాని జీ స్టూడియోస్, కరణ్ జోహార్ లు నిర్మాణం వహించారు. వారి ఖర్చు అంతా బాగానే కనిపిస్తుంది. ఒకటీ రెండు చోట్ల వి ఎఫ్ ఎక్స్ వర్క్ వీక్ గా ఉంది. ఇక పైన చెప్పిన విధంగా మ్యూజిక్ సో సో గానే ఉంది. సినిమాటోగ్రఫీ బానే ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. డైలాగ్స్ చాలా యావరేజ్ గానే ఉన్నాయి. ఇక దర్శకులు శరన్ శర్మ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి బిలో యావరేజ్ వర్క్ అందించారు అని చెప్పాలి. స్క్రీన్ ప్లే ని ఇంకాస్త ఎంగేజింగ్ గా మంచి ఎమోషన్స్ తో నడిపించి ఉంటే బాగుండేది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ చిత్రం ఈ “మిస్టర్ & మిస్ మాహి” సినిమాలో నటీనటులు బాగానే చేశారు కానీ సినిమాలో సోల్ దెబ్బ తీసింది. దర్శకుడు మరింత బెటర్ కథనంలో నడిపించాల్సింది. చాలా వీక్ గా సాగే కథనం, అంతగా మెప్పించని క్రికెట్ ఎపిసోడ్స్ బోర్ కొట్టించే సన్నివేశాలతో సినిమా నిరాశపరుస్తుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు