వైరల్ : పవన్, ధోని ఫ్యాన్స్ లో ట్రీట్ గా “బ్రో” పోస్టర్ ..!

Published on May 30, 2023 9:02 am IST


మన భారతదేశ ప్రేక్షకులకి సినిమా అలాగే క్రికెట్ రెండు కూడా ఎంటర్టైన్మెంట్ విభాగంలో రెండు కళ్ళు అని చెప్పొచ్చు. రెండిటికి కూడా భారీ ఆదరణ ఇచ్చే ఆడియెన్స్ లో పాన్ ఇండియా సినిమాలు సెన్సేషన్ ఎలాగో ఐపీఎల్ మ్యాచ్ లు కూడా అంతే అని చెప్పొచ్చు. మరి నిన్ననే అవైటెడ్ ఐపీఎల్ 2023 ఫైనల్ అయితే పలు ట్విస్ట్ లు అనంతరం స్టార్ట్ అయ్యింది.

గుజరాత్ టైటాన్స్ ఇచ్చిన భారీ లక్ష్యంతో అయితే చెన్నై సూపర్ కింగ్స్ వర్షం అనంతరం రంగంలో దిగి చివరి నిమిషం వరకు ఊహించని స్ట్రైక్ తో అయితే ఐదవ సారి తమ ఐపీఎల్ కప్ ని గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక నిన్న రాత్రి నుంచే సంబరాలు మొదలు కాగా సోషల్ మీడియాలో కూడా రచ్చ స్టార్ట్ అయ్యింది. అలా మన స్టార్ స్పోర్ట్స్ తెలుగు నుంచి అయితే అదిరే పోస్టర్ డిజైన్ చేసి వదలగా పవన్ ఫ్యాన్స్ లో వైరల్ అయ్యింది.

మరి నిన్నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల “బ్రో” చిత్రం నుంచి సాలిడ్ పోస్ట్ రాగా మరి నైట్ ఇదే పోస్టర్ లో అయితే థలా ధోని ని పవన్ ప్లేస్ లో ఐకానిక్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన జడేజా ని సాయి తేజ్ ప్లేస్ లో అయితే ఎడిట్ చేసి వదిలారు. దీనితో ఈ పర్ఫెక్ట్ టైమింగ్ అదిరిపోవడంతో ఈ పోస్టర్ ఇప్పుడు పవన్ ధోని ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా వారికి ట్రీట్ ఇస్తుంది.

సంబంధిత సమాచారం :