IPL 2025: మ్యాచ్ కి ధోని సాలిడ్ స్టేట్మెంట్ వైరల్!

IPL 2025: మ్యాచ్ కి ధోని సాలిడ్ స్టేట్మెంట్ వైరల్!

Published on Mar 23, 2025 4:00 PM IST

ఇప్పుడు మళ్ళీ ప్రతీ ఏడాది జరిగే అతి పెద్ద క్రికెట్ పండుగ రానే వచ్చింది. ఇండియన్ ఆడియెన్స్ సినిమా సహా క్రికెట్ కి ఎంటర్టైన్మెంట్ పరంగా పెద్ద పీట వేస్తారని అందరికీ తెలిసిందే. మరి ఇలా ఇపుడు స్టార్ట్ అయ్యిన ఐపీఎల్ మ్యాచ్ లపై భారీ హైప్ నెలకొంది. మరి నిన్న బెంగళూరు వర్సెస్ కలకత్తా జట్ల నడుమ స్టార్ట్ అయ్యిన ఐపీఎల్ నేడు భారీ ఫాలోయింగ్ ఉన్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ నడుమ జరుగుతున్నాయి.

అయితే ఈ మ్యాచ్ లలో ఎం ఎస్ ధోనీ కోసం కోట్ల మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నేడు మ్యాచ్ మొదలు కాక ముందు ధోని ఇచ్చిన ఒక సాలిడ్ స్టేట్మెంట్ ఇపుడు స్పోర్ట్స్ సహా తన ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. డెఫినెట్ గా ఐపీఎల్ ఫ్రాంచైజ్ కి ధోని వల్ల చాలా పేరు వచ్చింది. తాను లేని ఐపీఎల్ గాని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గాని ఊహించుకోవడం కష్టం.

అందుకే తనకి ఇంత ఏజ్ అయినా కూడా తనని తన క్రేజ్ తో కొనసాగిస్తున్నారు. మరి ఈ ఏడాది ఐపీఎల్ తో ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అని చాలా మంది అనుకుంటున్నారు కానీ థలా ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ ఇపుడు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. చెన్నై ఫ్రాంచైజ్ నాది నేను ఎంతకాలం కావాలి అనుకుంటే అంతకాలం ఆడుతాను నేను వీల్ చైర్ లో ఉన్నా కూడా మా వాళ్ళు నన్ను లాక్కొస్తారు. అంటూ చేసిన స్టేట్మెంట్ ఇపుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు