విషాదం : ప్రముఖ తెలుగు నిర్మాత మృతి

తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం అనారోగ్యంతో చనిపోయారు. ముళ్లపూడి బ్రహ్మానందం వయసు 68 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముళ్లపూడి బ్రహ్మానందం దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. ఆయన సహకారంతోనే ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.

ముళ్లపూడి బ్రహ్మానందం తన నిర్మాణంలో.. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి బ్రహ్మానందం నిర్మించారు. కాగా ముళ్లపూడి బ్రహ్మానందం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 123తెలుగు.కామ్ తరఫున ముళ్లపూడి బ్రహ్మానందం మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Exit mobile version