IPL 2025: కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఈజీ విక్టరీ

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన కోల్‌కతా వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ చప్పగా సాగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ధాటికి కోల్‌కతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కోల్‌కతా బ్యాటర్లు ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్ అందుకోలేకపోయారు. దీంతో కేవలం 16.2 ఓవర్లకే కోల్‌కతా నైట్ రైడర్స్ 116 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

ఇక చాలా తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ రియాన్ రికిల్‌టన్ (62)నాటౌట్, సూర్య కుమార్ యాదవ్ (27) తోడవడంతో కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులతో విజయాన్ని అందుకున్నారు. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌ను అలవోకగా గెలవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version