IPL 2025 : ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన తాజా మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్‌క్రమ్ (53) పరుగులతో రాణించగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు కూడా తమవంతుగా సహకరించారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 203 పరుగులు సాధించింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్య 5 వికెట్లు పడగొట్టడంతో లక్నో భారీ స్కోర్ చేయకుండా నియంత్రించాడు.

ఇక 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు త్వరత్వరగా ఔట్ అయ్యారు. అయితే, ఆ తర్వాత వచ్చిన నమన్ ధీర్(46), సూర్య కుమార్ యాదవ్(67), తిలక్ వర్మ (25), హార్ధిక్ పాండ్యా(28) పరుగులతో జట్టును విజయతీరాలకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ, లక్నో సూపర్ జెయింట్స్ లాస్ట్ ఓవర్‌లో పరుగులను నియంత్రించడంతో 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయ్యింది.

Exit mobile version