ఓటిటిలోకి వచ్చిన హార్రర్ మూవీ “ముంజ్యా”

ఓటిటిలోకి వచ్చిన హార్రర్ మూవీ “ముంజ్యా”

Published on Aug 25, 2024 8:05 AM IST

ఇటీవల థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ హర్రర్ కామెడీ ముంజ్యా డిజిటల్ ప్రీమియర్ కంటే ముందుగానే స్టార్ గోల్డ్‌లో నిన్న రాత్రి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యింది. తాజాగా ఈ చిత్రం నేటి నుండి, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో హిందీలో స్ట్రీమ్ చేయడానికి ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న విషయాన్ని వెల్లడించింది.

ఈ విషయం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. శర్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన ముంజ్యా చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది. మడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సచిన్ – జిగర్ సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు