సీనియర్ నటులు మురళీమోహన్ మనవరాలు రాగ పెళ్లి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహాతో ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ పెళ్లి గురించి మురళీమోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మురళీమోహన్ ఏం మాట్లాడారు అంటే.. ‘పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం నా మనవరాలు, శ్రీసింహాదే. పెళ్లికి ముందే వారిద్దరూ మంచి స్నేహితులు. ఐతే, ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు రాగ తన మనసులో మాట చెప్పింది. మేం సంతోషంగా అంగీకరించాం’ అని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.
మురళీమోహన్ ఇంకా మాట్లాడుతూ.. ‘పైగా విజయేంద్రప్రసాద్ నాకు క్లాస్‌మేట్. రాజమౌళి, కీరవాణి చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతికి వారిద్దరూ కారణం. వారంతా ఒకటిగా ఉంటారు. వాళ్ల కుటుంబాల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలు రాగకు బాగా నచ్చాయి. చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబాలంటే తనకు ఎంతో ఇష్టం. అలా, మా మనవరాలు ఆ కుటుంబాన్ని ఎంతో ఇష్టపడింది. శ్రీసింహాను ఇష్టపడుతున్నానని అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటామని అడిగింది. కుటుంబమంతా ఓకే చెప్పాం’ అని మురళీమోహన్ తెలిపారు.