“మురారి” రీ-రిలీజ్: 2 రోజుల్లో 7 కోట్లకి పైగా వసూళ్లు!

“మురారి” రీ-రిలీజ్: 2 రోజుల్లో 7 కోట్లకి పైగా వసూళ్లు!

Published on Aug 11, 2024 1:59 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మురారి రీ-రిలీజ్ వసూళ్లను చూసి చెప్పవచ్చు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన మళ్ళీ థియేటర్ల లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే 7.4 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చూడబోతే ఈ చిత్రం ఈ ఆదివారం రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా, లక్ష్మీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందించారు. ఏదేమైనా మహేష్ బాబు మరోసారి తన చిత్రం రీ- రిలీజ్ తో ఇండస్ట్రీ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు