ఆకట్టుకుంటున్న “పగ పగ పగ” ఫస్ట్ గ్లింప్స్…విలన్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి!

ఆకట్టుకుంటున్న “పగ పగ పగ” ఫస్ట్ గ్లింప్స్…విలన్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి!

Published on Aug 12, 2022 8:43 AM IST

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రాబోతోన్న చిత్రం పగ పగ పగ. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు. రీసెంట్‌గా విడుదల చేసిన సినిమా పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేతుల మీదగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయించారు. మోషన్ పోస్టర్ చూపించిన తీరు, అందులోని డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంతో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రతి నాయకుడిగా పరిచయం కాబోతోన్నారు.

కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో కోటి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, లుక్‌తో అందరినీ మెప్పించారు. హలో పెజ్జోని పేటోడికి పని ఇస్తే, వాడు ఆఖరి క్షణంలో ఉన్నా పని పూర్తి చేసి చస్తాడు అంటూ చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కోటి, సినిమాటోగ్రఫర్‌ నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌ పాపారావు, ఫైట్స్ రామ్ సుంకర, ఈ నిర్మాత సత్య నారాయణ, సహ నిర్మాత సత్యవతి, పీఆర్వో సాయి సతీష్, పర్వతనేని రాంబాబు, దర్శకత్వం రవి శ్రీ దుర్గా ప్రసాద్ లుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు