ర‌చ‌యిత‌గా మారిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌సంత్

ర‌చ‌యిత‌గా మారిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌సంత్

Published on Jun 14, 2024 9:35 AM IST

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ‘సుడిగాడు’ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా శ్రీ వ‌సంత్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌రువాత ఆయ‌న పలు హిట్ సినిమాల‌కు సంగీతం అందించారు. అయితే, ఆయ‌న ప్ర‌స్తుతం ర‌చ‌యితగా మారారు. త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మ‌హారాజ’ నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది.
నిధిల‌న్ స్వామినాథ‌న్ డైరెక్ట్ చేసిన ‘మ‌హారాజ’ మూవీకి మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. అయితే, ఈ సినిమాకు శ్రీ వ‌సంత్ పాట‌లతో పాటు మాట‌లు కూడా రాశారు. ఈ సినిమాలోని ‘అమ్మ నీకే నాన్నయ్యనా’ అనే పాట బాగా పాపుల‌ర్ అయ్యింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఈ పాట‌కు మ‌రో అసెట్ గా నిలిచింది.
ఇక శ్రీ వ‌సంత్ కు చెందిన డబ్బింగ్ కంపెనీ “పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ లోనే ‘మ‌హారాజ’ మూవీ డ‌బ్బింగ్ జ‌రుపుకోవ‌డం విశేషం. గ‌తంలో ‘కార్తికేయ‌-2’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కూడా ఇక్క‌డే డ‌బ్బింగ్ జ‌రుపుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు