లేటెస్ట్..”భోళా శంకర్” మ్యూజిక్ మ్యానియా స్టార్ట్.!

Published on May 30, 2023 1:51 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “భోళా శంకర్” కోసం అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అయితే ఈ సాలిడ్ చిత్రం తెరకెక్కుతూ ఉండగా మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ ఇపుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు. గత కొన్నాళ్ల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యూజికల్ అప్డేట్ అయితే ఇపుడు వచ్చేసింది. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించగా ఆల్రెడీ పలు సాంగ్స్ షూట్ కూడా మేకర్స్ కంప్లీట్ చేశారు.

ఇక ఈ సినిమా నుంచి అయితే భోళా మ్యూజిక్ మ్యానియా ని అయితే స్టార్ట్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు మెగాస్టార్ పై సూపర్ పోస్టర్ తో అయితే అనౌన్స్ చేశారు. అతి త్వరలోనే సినిమా మ్యూజిక్ జాతర స్టార్ట్ కానుంది అని అయితే మేకర్స్ ఇప్పుడు తెలిపారు. మరి మెగాస్టార్ కి తగ్గ సాలిడ్ ఆల్బమ్ ఈ సినిమా నుంచి ఉంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :