పాటల సమీక్ష : ‘ఇస్మార్ట్ శంకర్’ – మ‌ణిశ‌ర్మ మాస్ ట్రీట్ !

పాటల సమీక్ష : ‘ఇస్మార్ట్ శంకర్’ – మ‌ణిశ‌ర్మ మాస్ ట్రీట్ !

Published on Jul 15, 2019 1:15 PM IST

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’. జూలై 18న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న‌ ఈ చిత్రం నుండి ఆల్బమ్ రిలీజ్ అయింది. ఇక మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

1. పాట : ఇస్మార్ట్ సాంగ్ Ismart

ఈ సినిమాలో మొదటి పాట ఈ ఇస్మార్ట్ సాంగ్, ఇది విన్న క్షణంలోనే సాంగ్ లోని మాస్ బీట్స్ అలాగే గానం బాగున్నాయనిపిస్తాయి. ఈ పాట ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్ లోని బీట్స్, మాస్ కి బాగా నచ్చుతుంది. మొత్తానికి పూరి తన శైలి ఎలిమెంట్స్‌ తో తిరిగి వచ్చాడు. మణి శర్మ తన ట్యూన్‌ తో ఆకట్టుకోగా, భాస్కర్ బట్ల తన సాహిత్యంతో ఆకట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

Ismart 2. పాట :జిందాబాద్ జిందాబాద్ సాంగ్

ఈ సాంగ్ రామ్.. నభా నటేష్ ల మధ్య సాగే ఒక రొమాంటిక్ సాంగ్. ఈ పాటకు సంగీత దర్శకుడు మణిశర్మ ఒక డిఫరెంట్ ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఈ పాటకు సాహిత్యం అందించిన భాస్కరభట్ల. రొమాంటిక్ సాంగ్ అయినా రామ్ పాత్రకు తగ్గట్టు కాస్త ఘాటు పదాలతో రొమాన్స్ దట్టించారు. “జిందాబాద్ జిందాబాద్ ఎర్రని పెదవులకి.. జిందాబాద్ జిందాబాద్ కుర్రాడి చూపులకి.. అంటూ సాంగ్ రచ్చగా సాగింది. ఈ పాటను పాడిన శరత్ సంతోష్.. రమ్య బెహరా. పాట మూడ్ కు తగ్గట్టు ఇద్దరూ అల్లరిగా చిలిపిగా పాడి మెప్పించారు. ఈ పాటను సూపర్ అని చెప్పలేం కాని ఒవరాల్ గా ఒకే. నాలుగైదు సార్లు వింటే నచ్చే పాట ఇది.

 

3. పాట : బోనాలు సాంగ్ Bonalu

బోనాల పండుగ నేపథ్యంలో సాగుతున్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలోని మొత్తం ఆల్బమ్ లో ఈ పాట మంచి హిట్ అయింది. రేపు విడుదల తరువాత థియేటర్లో ఈ సాంగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తోంది.

 

4. పాట : ఉండిపో సాంగ్ ఇస్మార్ట్Undipo

ఉండిపో.. ఉండిపో అంటూ అనురాగ్ కుల‌క‌ర్ణి, రమ్య బెహ్రా ఆల‌పించిన ఈ మెలోడీ పాటలో పూరి స్టైల్ రొమాంటిక్ సన్నివేశాలు కనిపించేలా ఉన్నాయి లిరిక్స్. ఈ పాట సంగీత ప్రియుల‌ని ఆకట్టుకుంటూ కుర్రకారుకు హుషారెత్తించేలా ఉంది. హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌లో మణిశర్మ సమకూర్చిన మెలోడీ ట్యూన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఈ చిత్రం విడుదల అయిన తర్వాత ఈ సాంగ్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది.

 

5. పాట : దిమాక్ ఖరాబ్ సాంగ్ Dimaak Kharaab

దిమాక్ ఖ‌రాబ్‌..’ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాట‌ ఫుల్ ఎనర్జిటిక్ బీట్స్‌ తో సాగుతుంది. మంచి డ్యాన‌ర్స్‌గా పేరున్న రామ్ కు మ‌రోసారి అదిరిపోయే స్టెప్పుల‌తో అలరించడానికి ఈ పాట బాగా ఉపయోగపడేలా ఉంది. కాస‌ర్ల‌శ్యామ్ రాసిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ‌, సాకేత్ చాల బాగా పాడారు. అలాగే మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం కూడా ఈ పాట బాగా కలిసి వచ్చింది.

 

తీర్పు:
మొత్తంమీద, ఇస్మార్ట్ శంకర్ తో మణిశర్మ ఈమధ్య కాలంలో తన స్థాయికి తగ్గ ఆల్బమ్ ఇచ్చాడు. సినిమా నేపధ్యానికి తగ్గట్లుగా, సినిమాలోని సందర్భానుసారంగా వచ్చే పరిస్థితులకు తగట్లుగా మణిశర్మ పాటలను తీర్చిదిద్దారు. అయితే ఈ ఆల్బమ్ మాస్ ఆడియన్స్ ఆకట్టుకునే స్థాయిలో మిగిలిన వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చు. అయితే సినిమాలో విజువల్ గా సాంగ్స్ చూశాక ప్రేక్షకులకు ఎక్కువుగా రీచ్ అవ్వొచ్చు. ముఖ్యంగా ఇస్మార్ట్ టైటిల్ సాంగ్, జిందాబాద్ మరియు బోనాలు సాంగ్ లు తెరపై ఉన్న భారీ విజువల్స్ తో చూసిన తర్వాతే ఇంకా బాగా క్లిక్ అవుతాయి.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు