పాటల సమీక్ష: సైరా నరసింహారెడ్డి- హృదయాలను కదిలిస్తూ, దేశభక్తిని రగిలిస్తూ…సాగిన పాటల పల్లకి.

పాటల సమీక్ష: సైరా నరసింహారెడ్డి- హృదయాలను కదిలిస్తూ, దేశభక్తిని రగిలిస్తూ…సాగిన పాటల పల్లకి.

Published on Oct 1, 2019 11:36 AM IST

మొదటితరం స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్ర పూర్తి పాటల ఆల్బమ్ నిన్న విడుదల చేయడం జరిగింది.బాలీవుడ్ దర్శకుడు అమిత్ త్రివేది స్వర పరిచిన నాలుగు పాటలతో కూడిన సైరా ఆల్బమ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…!

పాట 1: జాగో నరసింహ జాగో
సింగర్స్: కేవీ మహదేవన్,హరి చరణ్, అనురాగ్ కులకర్ణి
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

Jaago Narasimhaa Jaagore

Analysis:  ఆల్బమ్ లోని మొదటిపాట ప్రజలు తమ ఇలవేలుపుగా భావించే తమ దొర…, పాలకుడి ఇంట్లో సంభవించిన ఒకరి పుట్టుకను వేడుకగా జరుపుకొనే సందర్భంలో వస్తుందని అర్థం అవుతుంది. మంచి పాలకుడు, తమను కాపాడే ఓ దొర మంచిని కోరుతూ ఆయన ఆనందాన్ని తమ ఆనందంగా భావిస్తూ ఊరి ప్రజలు వేడుక నేపధ్యమే జాగో నరసింహ జాగో పాట. సీనియర్ సింగర్ కేవీ మహదేవన్ మరియు హరి చరణ్, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడగా సిరివెన్నెల సాహిత్యం పాటకు మంచి వన్నె తెచ్చింది.

Jaago Narasimhaa Jaagore

పాట 2: ఆనందం అంకితం
సింగర్స్: విజయ్ ప్రకాష్, షాషా తిరుపతి
లిరిక్స్: అనంత్ శ్రీరామ్

Analysis:  సైరా నరసింహారెడ్డి మూవీలో రెండవ పాట రొమాంటిక్ సాంగ్. అందం అంకితం అనే చరణాలతో మొదలైన ఈ పాట చిరు, నయనతార ల మధ్య ప్రేమ, అనుభందం తెలియజేసేలా ఆహ్లాదంగా సాగుతుందనిపిస్తుంది. మూవీలో ఒకే ఒక్క కమర్సిల్ సాంగ్ ఇదని చెప్పొచ్చు. నెమ్మదిగా మనసుకు హత్తుకొనేలా మెలోడియస్ గా సాగిన ఈ పాటలో సింగర్ షాషా వాయిస్ మధురంగా ఉంది. ఇక అనంత శ్రీరామ్ సాహిత్యం ఆనాటి పాటల తో పోలి మంచి పద ప్రయోగాలతో సాగింది.

పాట 3: ఓ…. సైరా
సింగర్స్: సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

O.... SYERAA

Analysis: ఓ సైరా … సాంగ్ మొదటి నుండి ప్రేక్షకులకి బాగా చేరిన పాట. సైరా నరసింహారెడ్డి పోరాట పటిమను, స్వాతంత్ర్య కాంక్షను, వీరోచిత గాథను తెలియజేసేలా సాగిన ఈ పాట విన్న వారికి కూడా దేశభక్తి స్ఫూర్తి నింపేలా ఉంది. తెల్లదొరల అవినీతి పాలను, అరాచక ధోరణిని ఎదిరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెగువను వివరించే విధంగా సాగిన సిరివెన్నెల సాహిత్యం, అమిత్ స్వరాలు బాగున్నాయి. ఇక లేడీ సింగర్స్ సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ ప్రాణం పెట్టి పాడినట్టున్నారు.

Yetu Pone

పాట 4 : శ్వాసలోన దేశమే…!
సింగర్స్: హరిచరణ్
లిరిక్స్: చంద్రబోస్

Analysis:  ఇక చివరిదైన శ్వాసలోన దేశమే…, సైరా నరసింహారెడ్డి దేశభక్తిని, దేశం కోసం ఆయన త్యాగనిరతి, ప్రాణ త్యాగాన్ని స్మరించుకుంటూ జాతి పాడుకొనే పాటగా తీర్చిదిద్దారు. దేశం కోసం, జాతి కోసం, ఆత్మాభిమానం, స్వాభిమానం కోసం ఆయన బ్రిటిషర్లను ఎదిరించిన తీరు తెలిసేలా చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం బాగుంది. అందరికి అర్థమయ్యేలా మెల్లగా హరిచరణ్ గొంతుకతో సాగిన ఈ పాట కూడా అలరిస్తుంది.

 

Verdict:-

మొత్తంగా చెప్పాలంటే నాలుగు పాటలు కలిగిన సైరా మ్యూజిక్ ఆల్బమ్ హృదయాలను కదిలిస్తూ, దేశభక్తిని రగిలిస్తూ సాగింది. చారిత్రక నేపథ్యంలో సాగే దేశభక్తి చిత్రం కావడంతో స్వరాలు కానీ, సాహిత్యం కానీ ఆనాటి పరిస్తితులను తలపించేలా రూపొందించడం జరిగింది. మెల్లగా సాగే పాటలు త్వరగా అర్థం అయ్యేలా ఉన్నాయి. ఐతే ఇంకొంచెం ముందుగా పాటల విడుదల చేస్తే ప్రేక్షకులలోకి వెళ్ళేవి. సంధర్బోచితంగా సాగే ఈ పాటల అసలు సత్తా తెలియాలంటే మూవీ చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు