ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ”మ్యూజిక్ షాప్ మూర్తి”

ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ”మ్యూజిక్ షాప్ మూర్తి”

Published on Jul 13, 2024 9:00 PM IST

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అజ‌య్ ఘోష్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ”మ్యూజిక్ షాప్ మూర్తి” ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేట‌ర్ల‌లో జూన్ 14న రిలీజ్ అయ్యింది. శివ పాల‌డుగు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అజయ్ ఘోష్ ప‌ర్ఫార్మెన్స్ కు మంచి మార్క‌లే ప‌డ్డాయి.

ఇక ఈ సినిమాలో మ‌రో ముఖ్య పాత్ర‌లో యంగ్ బ్యూటీ చాందినీ చౌద‌రి న‌టించింది. మ్యూజిక్ షాప్ మూర్తి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్ హిట్ గా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అయ్యింది.

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫాం ఈటీవి విన్ లో ఈ సినిమాను జూలై 16 నుండి స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చింది. మరి ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు