ఓటిటిలో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ”మ్యూజిక్ షాప్ మూర్తి”

ఓటిటిలో మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ”మ్యూజిక్ షాప్ మూర్తి”

Published on Jul 17, 2024 4:40 PM IST

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్, యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ఇటీవల‌ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ద‌క్కించుకుంది. ఈ సినిమాను థియేటర్ల‌లో చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా తాజాగా ఓటిటిలో స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఈ సినిమా ఓటిటి ఆడియెన్స్ ను సైతం ఆక‌ట్టుకుంటోంది. ఓటిటి ప్లాట్ ఫాంల‌పై ఈ సినిమా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోందని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సినిమాకు ఓటిటి ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ ఇస్తుండ‌టంతో మేక‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలతో, మంచి సందేశంతో కూడిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని వారు అంటున్నారు.

ఈ సినిమాలో ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ మరియు దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలను పోషించారు. శివ పాలడుగు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు