పూర్తైన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కొత్త సినిమా ‘మై డియర్ మార్తాండం’ !


ఇప్పటికే కమెడియన్ గా అనేక సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేసి మెప్పించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ చిత్రంలో ‘సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్ పార్టీ’ ఫేమ్ రాకేందు మౌళి కూడ ఒక ప్రధాన పాత్రను పోషించారు. అతి తక్కువ కాలంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడ ముగించుకుంది.

టైటిల్ లోనే వైవిధ్యాన్ని నింపుకున్న ఈ సినిమాను నూతన దర్శకుడు హరీష్. కెవి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. పృథ్వి ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించనున్నారు. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమాలో మంచి కోర్ట్ రూమ్ డ్రామా కూడ ఉండనుంది. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు విడుదలకానున్నాయి. జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, సుదర్శన్ వంటి స్టార్ కమెడియన్లు నటించిన ఈ సినిమాలో కల్పిక హీరోయిన్ గా నటించగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ కళ్యాణ్ విఠపు ఒక ముఖ్య పాత్రలో నటించారు.

Exit mobile version