సమీక్ష : “మై నేమ్ ఈజ్ శృతి” – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్

సమీక్ష : “మై నేమ్ ఈజ్ శృతి” – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్

Published on Nov 18, 2023 3:03 AM IST
My Name Is Shruthi Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: హన్సిక మోత్వాని, ప్రేమ, మురళీ శర్మ, పూజా రామచంద్రన్, రాజా రవీంద్ర, ప్రవీణ్, ఆడుకాలం నరేన్

దర్శకుడు : శ్రీనివాస్ ఓంకార్

నిర్మాత: బూరుగు రమ్య ప్రభాకర్

సంగీతం: మార్క్ కే రాబిన్

సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయిదపు

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరోయిన్ హన్సిక మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం “మై నేమ్ ఈజ్ శృతి” కూడా ఒకటి. మరి ట్రైలర్ తో మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రంతోనే హన్సిక చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. ఓ పేరు మోసిన బిజినెస్ మెన్ తన భార్య ను మరింత యవ్వనంగా మార్చాలని ఓ ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్మయి(ప్రేమ) ని కన్సల్ట్ చేస్తాడు. అయితే దానికి ఆమె ఒకరకమైన స్కిన్ పిగ్మెంట్ ట్రీట్మెంట్ కోసం చెప్తుంది. దానికోసం అతని భార్య చర్మం, రంగుకి తగ్గ అమ్మాయి ఒరిజినల్ స్కిన్ అవసరం అవుతుంది. మరి ఈ రాకెట్ అంతా ఓ మాఫియాలా నడుస్తుంది. దీనిని ఎమ్మెల్యే గురుమూర్తి(ఆడుకాలం నరేన్) నడిపిస్తూ ఉంటాడు. మరి ఈ మాఫియా ఓ యాడ్ ఏజెన్సీ లో వర్క్ చేసే శృతి(హన్సిక మోత్వాని) వరకు వస్తుంది. మరి అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది. ఇలాంటి ఒక మాఫియా కూడా ఉంది అనే దానికి ముగింపు ఏంటి? శృతి ఏం చేస్తుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కనిపించే మెయిన్ థీమ్ అయితే ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఆసక్తిగా ఉండగా దానిని హ్యాండిల్ చేసిన విధానం సెకండాఫ్ లో అక్కడక్కడా బాగుంటుంది. ఇక నటి హన్సిక చాలా కాలం తర్వాత టాలీవుడ్ చేసిన సినిమా ఇది కాగా ఆమె మంచి సబ్జెక్టునే పట్టుకుంది అని చెప్పాలి. అలాగే ఈ కథకి తగ్గట్టుగా ఆమె చూపించిన పెర్ఫామెన్స్ ఆమె చూపించిన వేరియేషన్స్ నీట్ గా ప్రెజెంట్ చేసింది.

అలాగే ఆమెతో పాటుగా కనిపించిన సాయి తేజ ఆడుకాలం నరేన్ అలాగే మురళి శర్మ లు తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. అలాగే నటుడు ప్రవీణ్ కూడా లిమిటెడ్ పాత్ర అయినప్పటికీ మంచి రోల్ లో కనిపిస్తాడు. ఇక దీనితో పాటుగా సెకండాఫ్ లో కనిపించే కొన్ని ట్విస్ట్ లు ఆసక్తికర నరేషన్ ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగుంది కానీ ఆ లైన్ ని డిటైల్డ్ గా చూపించడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. స్టార్టింగ్ లో పర్వాలేదు కానీ ఫస్టాఫ్ అయ్యే వరకు కూడా ఆ కాన్సెప్ట్ లో సినిమా ఉన్నట్టు అనిపించదు. దీనితో సెకండాఫ్ వరకు కూడా ఒక బోరింగ్ అండ్ అనవసర ఫస్టాఫ్ ని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగని సెకండాఫ్ కూడా పూర్తి ఇంప్రెసివ్ గా ఉందా అంటే అది కూడా లేదని చెప్పాలి.

నరేషన్ ని ఆల్రెడీ మనం కొన్ని థ్రిల్లర్స్ లో చూసినట్టే అనిపిస్తుంది. దీనితో తెరకెక్కించిన విధానం బాగున్నప్పటికీ ఆ ట్విస్ట్ లు అవీ ఊహించిన విధంగా అనిపించపోయినప్పటికీ కానీ మనం ఆల్రెడీ చూసిందే కదా అనిపిస్తుంది. ఇంకొకటి మెయిన్ గా దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ప్రెజెంట్ చేసి ఉంటే సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. ఇక నటి ప్రేమ పాత్రకి మరికాస్త ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నీకల్ టీం లో సంగీతం, సినిమాటోగ్రఫీ లు పర్వాలేదు. అలాగే ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బెటర్ చేయాల్సింది. డైలాగ్స్ కూడా ఓకే. ఇక దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి వర్క్ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే తాను ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నప్పటికీ దానిని ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో కాస్త తడబడ్డాడు.

మెయిన్ ఆ ఫస్టాఫ్ లో డిజప్పాయింట్ చేసాడని చెప్పాలి. సినిమా మెయిన్ లైన్ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇక సెకండాఫ్ లో మాత్రం తన బ్రిలియెన్స్ ని కనబరిచాడు. చాలా సీన్స్ వాటి కనెక్షన్ లు వాటికి మరో వెర్షన్ ని డిజైన్ చేయడం బాగున్నాయి. ఇవి కూడా ఒక వెర్షన్ లో ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది. ఇది మినహా తన వర్క్ ఓకే అనిపిస్తుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే “మై నేమ్ ఈజ్ శృతి” లో హన్సిక డీసెంట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది కానీ కాన్సెప్ట్ ని ఇంకా హైలైట్ చేసి ఇంకా బెటర్ ముగింపు ఇస్తే బాగుండేది. దీనితో ఈ వారాంతానికి ఈ చిత్రం జస్ట్ ఓకే ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు