మరో ఇంట్రెస్టింగ్ మూవీని తెలుగులో రిలీజ్ చేయనున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్!

మరో ఇంట్రెస్టింగ్ మూవీని తెలుగులో రిలీజ్ చేయనున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్!

Published on Aug 23, 2024 3:01 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో భారీ చిత్రాలను నిర్మిస్తూ, ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాకుండా, ఇతర భాషల చిత్రాలను కూడా నిర్మిస్తోంది ఈ నిర్మాణ సంస్థ. అయితే మిగతా భాషల్లో మంచి కంటెంట్ తో తెరకెక్కించే చిత్రాలను కూడా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పీ ద్వారా రిలీజ్ చేస్తోంది.

తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. టొవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ, బసిల్ జోసెఫ్, రోహిణి, హరీష్ ఉత్తమన్, జగదీష్, ప్రమోద్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళ చిత్రం ARM. జితిన్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వారు సొంతం చేసుకున్నారు. త్వరలో థియేటర్ల లోకి రాబోతున్న ఈ చిత్రానికి దిబు నినన్ థామస్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు