నైజాం లో “సలార్” ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి!

నైజాం లో “సలార్” ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి!

Published on Nov 16, 2023 6:46 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ కోసం ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న థియేటర్లలోకి రానుంది. సలార్‌ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలోని ప్రేక్షకులకు అందించనున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

అయితే ఈ నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ ను 90 కోట్ల 6 లక్షల రూపాయలకి సొంతం చేసుకున్నారు. ఇందులో 65 కోట్ల రూపాయలు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ కాగా, 25 కోట్ల 6 లక్షల రూపాయలు రిఫండబుల్. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు. హోంబలే ఫిలింస్‌కు చెందిన విజయ్ కిరంగదూర్ ఈ భారీ చిత్రాన్ని చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు