బాలకృష్ణ సినిమా టైటిల్‌పై మేకర్స్ క్లారిటీ..!

Published on Sep 15, 2021 7:50 pm IST


నంద‌మూరి బాల‌కృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాల‌కృష్ణ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. రెండు రోజులుగా ఈ సినిమాకు ‘రౌడీయిజం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయబోతున్నారని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బాలకృష్ణతో నిర్మించబోతున్న సినిమా కోసమే ఈ పేరును రిజిస్టర్ చేయించారనే ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ ప్రచారంపై దర్శకుడు మలినేని గోపీచంద్ స్పందిస్తూ #NBK107 మూవీ టైటిల్‌పై జరుగుతున్న కథనాలు ఏవీ నిజం కాదని, ఆ సినిమాకి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదని అన్నారు. సినిమా టైటిల్ విషయంలో రేకెత్తుతున్న ఈ ఆసక్తి, ఉత్సుకత ఆనందాన్ని కలిగిస్తుందని, ఈ సినిమాకి సరిపోయే టైటిల్‌ని, ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :