ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిగణలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరో డ్రాగన్ హీరోతో సినిమా చేస్తున్నారు.
రీసెంట్ గా కోలీవుడ్ సహా తెలుగులో కూడా డ్రాగన్ అనే సినిమాతో భారీ హిట్ అందుకున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ కలయికలో చేస్తున్న చిత్రంపై ఇపుడు సాలిడ్ అప్డేట్ వచ్చింది. ప్రదీప్ కెరీర్లో నాలుగవ సినిమాగా మైత్రి సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఫస్ట్ షాట్ భూమ్ గా రేపు మార్చ్ 26న రిలీజ్ చేస్తున్నట్టుగా ఉదయం 11 గంటల 7 నిమిషాల సమయాన్ని లాక్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సెన్సేషనల్ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ ట్యూన్స్ అందిస్తున్నాడు. మరి ఈ అప్డేట్ ఏంటో చూడాలి.